Deputy CM Bhatti Vikramarka: రైతులకు ఉపయోగపడేలా భూ భారతి చట్టాన్ని జాగ్రత్తగా రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సహచర మంత్రులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.