
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆమెను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో ప్రస్తుతం వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పమేలా సత్పతిని బదిలీపై ఇక్కడికి రానున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తొలి కలెక్టర్ గా అనితా రామచంద్రన్ జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించారు.