https://oktelugu.com/

Tragedy: స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లలో అపశ్రుతి

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు రేపు అంబరాన్నంటనున్నాయి. రేపటి ఉత్సవాల కోసం శనివారం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో అపశ్రుతి దొర్లి ముగ్గురు మున్సిపల్ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. డైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీతో భవనంపైకి ఎక్కిన సిబ్బంది జెండా ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ విరిగిపడింది. దీంతో ట్రాలీ అదుపు తప్పి ఆ నలుగురు సిబ్బంది […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 14, 2021 / 05:15 PM IST
    Follow us on

    దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు రేపు అంబరాన్నంటనున్నాయి. రేపటి ఉత్సవాల కోసం శనివారం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో అపశ్రుతి దొర్లి ముగ్గురు మున్సిపల్ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. డైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీతో భవనంపైకి ఎక్కిన సిబ్బంది జెండా ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ విరిగిపడింది. దీంతో ట్రాలీ అదుపు తప్పి ఆ నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రిలో చేరారు.