
కరోనా కట్టడికి దేశ రాజధానిలో విధించిన సంపూర్ణ లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నేషనల్ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరుతూ లేఖ రాసింది. కథిన నియంత్రణలు అము చేస్తూ దశల వారీగా ఢిల్లీలో మార్కెట్లను తెరవాలని వారు కోరారు. లాక్ డౌన్ ఎవరూ అనుకూలంగా లేకపోయినా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అయితే ప్రస్తుతం లాక్ డౌన్ పొడిగించకుండా కఠిన నియంత్రణలో దశల వారీగా మార్కెట్లను ఓపెన్ చేయాలని తాము కోరుతున్నామని ఎన్డీటీఏ ప్రెసిడెంట్ అతుల్ భార్గవ కోరారు.