Piyush Goyal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ ఒప్పందం విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చల్లో పాల్గొన్న సమయంలో నూ మాట్లాడుకున్నారన్నారు. వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయన్నారు. ఈ సమస్యను ఇరుదేశాలు ధ్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయని వెల్లడించారు.