Rajamouli Sensational Post ipl final : IPL 2025 చివరి దశకు చేరుకుంది. ఎంతో ఉత్కంఠ మధ్య సాగిన ఈ సీజన్ ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindhoor) కారణంగా కొద్దిరోజులు వాయిదా పడింది. యుద్ధం ఆగిన తర్వాత మళ్ళీ IPL ని తిరిగి ప్రారంభించారు. ప్రతీ సీజన్ లో విఫలం అవుతూ వస్తున్న రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB) టీం, ఈ సీజన్ లో మాత్రం విజృంభించింది. దాదాపుగా 11 ఏళ్ళ తర్వాత ఈ టీం ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. నిన్న పంజాబ్ సూపర్ కింగ్స్(PBKS) మరియు ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య జరిగిన హోరాహోరీ ప్లే ఆఫ్ మ్యాచ్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించి రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం తో తలపడనుంది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,IPL టోర్నమెంట్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు రేపు ఫైనల్స్ లో తలపడబోతున్న ఈ రెండు టీమ్స్ ఒక్క ట్రోఫీ ని కూడా గెలుచుకోలేదు.
ముఖ్యంగా RCB టీం ట్రోఫీ గెలవలేదని సోషల్ మీడియా లో ఏ రేంజ్ ట్రోల్స్ నడుస్తూ ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాల్లో కూడా ఈ టీం ని వెక్కిరిస్తూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. అలాంటి ట్రోల్స్ కి రేపు ఈ టీం తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో చెక్ పెట్టబోతోందా?, లేకపోతే ఈసారి కూడా ఎప్పటి లాగానే ట్రోల్స్ ని ఎదురుకోబోతుందా అనేది చూడాలి. ఇక పంజాబ్ కింగ్స్ సంగతి సరే సరి. ప్రతీ మ్యాచ్ లో కూడా వీళ్ళు తమ వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ బ్యాడ్ లక్ కారణంగా ట్రోఫీ కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇలా బ్యాడ్ లక్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలబడిన ఈ రెండు టీమ్స్ రేపు ఫైనల్ మ్యాచ్ ఆడడంపై డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘నిన్నటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఆట తీరు అద్భుతం. ఢిల్లీ క్యాపిటల్స్ టీం ని ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. KKR టీం కి కప్పు గెలిపించి ఇచ్చాడు. కానీ ఆ రెండు టీమ్స్ అతన్ని వదిలేశాయి. ఇప్పుడు 11 ఏళ్ళ తర్వాత పంజాబ్ కింగ్స్ ఫైనల్స్ కి తీసుకెళ్లిన ఘనత కూడా శ్రేయాస్ అయ్యర్ కి సొంతం. ఆయన పంజాబ్ కింగ్స్ కి కూడా కప్పు గెలిపించి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా RCB తరుపున అద్భుతంగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించిన కోహ్లీ(Virat Kohli) కి కూడా RCB విజయాన్ని ఆస్వాదించడానికి అర్హుడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు ఓడినా హార్ట్ బ్రేకింగ్ లాగానే ఉంటుంది’ అంటూ రాజమౌళి వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
Iyer guiding Bumrah’s and Boult’s yorkers to the third man boundary… Exquisite…
This man leads Delhi to a final… and is dropped…
Leads Kolkata to a trophy… dropped…
Leads a young Punjab to the finals after 11 years.
He deserves this year’s trophy too…On the other hand,… pic.twitter.com/ws0anhcZ3l
— rajamouli ss (@ssrajamouli) June 2, 2025