Tollywood Drugs Case: 5 గంటలుగా కొనసాగుతున్న ఛార్మి విచారణ
మనీ లాండరింగ్ చట్టం కింద సినీ రంగానికి చెందిన 12 మందికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇవాళ ప్రముఖ నటి, నిర్మాత ఛార్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు ఐదు గంటల నుంచి ఈడీ కార్యాలయంలో ఛార్మిని ప్రశ్నిస్తున్నారు. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మాదక ద్రవ్యాల సరఫరాదారు కెల్విను ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు.