https://oktelugu.com/

Pawan Kalyan: ప్రీలుక్ అదుర్స్.. ‘గబ్బర్ సింగ్’ రిపీట్ అవుతుందా?

Pawan Kalyan , Harish Shankar Film: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవర్ ను చూపించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. పవన్ ను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఊగిపోతారు? ఎలా కామెడీ, యాక్షన్ పండిస్తే అట్రాక్ట్ అవుతారో ఆ లెవల్ లో చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ చూపించి ఫ్యాన్స్ ను ఊర్రూత లూగించాడు. పవన్ మేనియా ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ చిత్రంలో చూశాం. ఆ కాంబో మరోసారి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2021 / 04:35 PM IST
    Follow us on

    Pawan Kalyan , Harish Shankar Film: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవర్ ను చూపించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. పవన్ ను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఊగిపోతారు? ఎలా కామెడీ, యాక్షన్ పండిస్తే అట్రాక్ట్ అవుతారో ఆ లెవల్ లో చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ చూపించి ఫ్యాన్స్ ను ఊర్రూత లూగించాడు. పవన్ మేనియా ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ చిత్రంలో చూశాం. ఆ కాంబో మరోసారి రిపీట్ కానుంది.

    దర్శకుడు హరీష్ శంకర్, నటుడు పవన్ కళ్యాణ్ లు ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో సూపర్ హిట్ అందించారు. ఆ కాంబినేషన్ లోనే తాజాగా అంతే ఉత్సాహంతో మరోసినిమాతో మన ముందుకు వస్తున్నారు.

    పీఎస్.పీకే 28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొన్ని నెలల కిందట విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ విశేషంగా అలరించింది.

    పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర బృందం తాజాగా ప్రీలుక్ ను విడుదల చేసింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్ తోపాటు సినిమా పేరు సహా మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. ప్రీలుక్ థీమ్, స్టైల్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీ మాస్ మసాలా అని.. ‘గబ్బర్ సింగ్’ను మించి ఉంటుందని అంటున్నారు. కథ కూడా మాస్ మాసాలాగానే హరీష్ శంకర్ రూపొందించినట్టు చెబుతున్నారు.

    ప్రస్తుతం పవన్ ‘బీమ్లా నాయక్’ మూవీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చిత్రం చేయనున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ మూవీ ఉండనుంది. ఇక ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలిసింది.

    https://twitter.com/harish2you/status/1433378004592312321?s=20