https://oktelugu.com/

టోక్యో ఒలింపిక్స్.. క్వార్టర్స్ లోకి బజరంగ్ పూనియా

టోక్యో ఒలింపిక్స్ 65 కిలోల ఫ్రీస్టయిల్ మ్యాచ్ లో ఇవాళ బజరంగ్ పూనియా కిర్గిస్తాన్ కు చెందిన బలమైన ప్రత్యర్థి ఎర్నజర్ అక్మతలేవ్ పై విజయం సాధించాడు. రసవత్తరంగా సాగిన బౌట్ లో పూనియా పాయింట్ల ఆధారంగా గెలుపొందాడు. నిజానికి ఇద్దరూ 3-3 స్కోర్ చేసినా తొలి పీరియడ్ లో టేక్ డౌన్ వల్ల బజరంగ్ కు విజయం దక్కింది. ఫస్ట్ పీరియడ్ లో బజరంగ్ పూనియా మూడు పాయింట్లు సాధించాడు. అయితే కిర్గిస్తాన్ ప్లేయర్ ఫస్ట్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 6, 2021 / 09:57 AM IST
    Follow us on

    టోక్యో ఒలింపిక్స్ 65 కిలోల ఫ్రీస్టయిల్ మ్యాచ్ లో ఇవాళ బజరంగ్ పూనియా కిర్గిస్తాన్ కు చెందిన బలమైన ప్రత్యర్థి ఎర్నజర్ అక్మతలేవ్ పై విజయం సాధించాడు. రసవత్తరంగా సాగిన బౌట్ లో పూనియా పాయింట్ల ఆధారంగా గెలుపొందాడు. నిజానికి ఇద్దరూ 3-3 స్కోర్ చేసినా తొలి పీరియడ్ లో టేక్ డౌన్ వల్ల బజరంగ్ కు విజయం దక్కింది. ఫస్ట్ పీరియడ్ లో బజరంగ్ పూనియా మూడు పాయింట్లు సాధించాడు. అయితే కిర్గిస్తాన్ ప్లేయర్ ఫస్ట్ క్వార్టర్ లో ఒక పాయింట్, సెకండ్ పీరియడ్ లో రెండు పాయింట్లు సాధించి సమనంగా నిలిచాడు. కానీ విక్టరీ బై పాయింట్స్ ఆధారంగా బజరంగ్ పూనియాను విజేతగా ప్రకటించారు.