
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 16,40,287 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 44,643 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల్లో నాలుగు శాతం మేర పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా మరో 464 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా 4.26 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని శుక్రవారం కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,14,159 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు.