
తెలంగాణపై 5.9 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రమావంతో రాష్ట్రంలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.