Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండానే ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. వీటిని పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అవసరమైన పెట్టుబడులు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనులను చక్కబెట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అయితే ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు పని భారం అధికంగా ఉంటుంది. అయితే కొందరు పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా వ్యాపారులకు ధన లాభం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. ఇవి వ్యాపారులకు కలిసి వస్తాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో తోటి వారి సహకారం ఉండటంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. దీంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కొన్ని పనులను ఓపికతో పూర్తి చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడమే మంచిది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరిగిపోతాయి. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు. బకాయిలు వసూలు అవుతాయి. ఇదే సమయంలో ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణము ఉంటుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. కొందరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు తమ పిల్లల కెరీర్ పై ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఇంట్లో జరిగే శుభకార్యం విషయంలో శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకోకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
