Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు మౌని అమావాస్య సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) :. ఈ రాశి వారు ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఎప్పుడు మెరుగైన లాభాలు ఉండనున్నాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు అనేక శుభ ఫలితాలు వినాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే మీకు ఏమి సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇదే సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. స్నేహితుల సహాయంతో ధన సమస్యలు తీరుతాయి. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలగనున్నాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు గురువుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఏ రోజు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలు పాల్గొనేందుకు తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సమయం అనుకూలంగా ఉండడంతో ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు కుటుంబ వాతావరణ సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. సంబంధాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేయడంతో అధికారుల మద్దతు ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. దూర ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల మద్దతుతో వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు తెలివిగా ప్రవర్తించడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలకరిగి తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తు సొంతవాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఏ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కట్టానికి తగిన ఫలితం ఉంటుంది. స్నేహితుల నుంచి ధన సహాయ పొందుతారు. వ్యాపారులు మెరుగైన లాభాలు చదువుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఎప్పుడూ లాభాలు ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు వ్యాపారులు లాభాలు పొందుతారు.