Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 6.4.2026 : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లక్కీ డే.....

Today horoscope in telugu 6.4.2026 : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లక్కీ డే.. కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తారు..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం. మరికొన్ని రాశుల వారు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడును పెడతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ప్రియమైన వారికి ఈరోజు వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పెద్దల సలహాతో పెట్టుబడులు పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు పెద్దల సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొందరు మీకు ముఖ్యమైన వస్తువులను ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు తమ కార్యకలాపాల్లో రాణిస్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు పెరిగిపోతాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పటివరకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల అండదండలతో ఇల్లు సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులు అధికారుల మద్దతు పొందడంతో పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు చట్టపరమైన చెక్కుల నుంచి బయటపడతారు. అయితే అనవసరపు వివాదాల నుంచి దూరంగా ఉండాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి కొత్త అవకాశాలు అందుతాయి. దీంతో ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయడానికి రెడీ అవుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా కలిసి పోతారు. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular