Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 16.2.2026 : ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు ప్రత్యేకం.....

Today horoscope in telugu 16.2.2026 : ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు ప్రత్యేకం.. ఎందుకంటే?

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ప్రత్యేకమని చెప్పవచ్చు. మరికొన్ని రాశులవారు బ్యాడ్ న్యూస్ వింటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారాలు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల కెరీర్ పై కీలకమైన తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు అందుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి శుభవార్తలు అందుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. వీరి ద్వారా అధిక లాభాలను గడించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తోటి వారి సహకారం ఉంటుంది. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలో రాణించాలంటే గురువుల మద్దతు తప్పనిసరి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు పుష్కలంగా లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సంతృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సరదాగా ఉంటారు. కొన్ని సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు తోటి వారి సహకారంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కొన్ని కంపెనీల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల నుంచి మద్దతు ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఇతరులకు బహుమతులను అందజేస్తారు. దీంతో బంధువుల మధ్య ప్రేమానుబంధాలు పెరిగిపోతాయి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసేవారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతారు. ఇతరులకు దానధర్మాలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు రాజకీయాల్లో ఉంటే వీరికి అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు చాకచక్యంగా వ్యవహరిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరైనా చెడు మాటలు చెబితే వాటికి దూరంగా ఉండటమే మంచిది. కుటుంబ సభ్యులపై నమ్మకాన్ని పెంచుకోవాలి. స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగాలు పొందేందుకు కష్టపడాల్సి ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పిల్లల కెరీర్ విషయంలో కొందరిని సంప్రదిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకమైన చెప్పవచ్చు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular