Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాసులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు కొన్ని రాశుల వారు సంతోషంగా ఉండగలుగుతారు. మరికొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు వారి వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కొన్ని మార్పులు చేయగలుగుతారు. ఉద్యోగుల లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. బదిలీలు ఉండే అవకాశం ఉంది. అదనపు ఆదాయం పొందుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అయితే వీరితో ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే వీటిని త్వరగా పరిష్కరించుకుంటారు. డబ్బులు ఎక్కువగా వృధా చేయొద్దు. ఖర్చులను వెబ్లో ఉంచుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. కొన్ని రకాల శిక్షణలు పొందడంలో బిజీగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్తపెట్టబడులు పెడతారు. ఎవరి దగ్గరైనా డబ్బు ఆగిపోతే ఈరోజు తిరిగి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈరోజు కొన్ని సవాలను స్వీకరించాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు లాభాలను పొందుతారు. ప్రతిభను ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహా తీసుకోవడం వల్ల లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. విద్యార్థులను పోటీ పరీక్షలో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తారు. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఏదైనా ముఖ్యమైన పని గతంలో ప్రారంభిస్తే ఈరోజు పూర్తి చేస్తారు. ప్రైవేటు ఉద్యోగంలో చేసేవారు లాభాలు పొందుతారు. అయితే కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులను అప్పుడే నమ్మకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఏదైనా సాధించాలని అనుకుంటే దానికోసం ఈ విధంగా కృషి చేస్తారు.. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. చుట్టూ ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ఆదాయ వనరులు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన తీవ్ర నష్టం జరుగుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ధనుస్సు రాశి వారికి ఈరోజు శక్తి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి. దీంతో ఏ పనిని ప్రారంభించిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆర్థికంగా లాభాలు ఉండలు ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో చేపట్టిన పనులను వెంటనే గుర్తు చేసుకోవాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రియమైన వారి కోసం వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కష్టపడాల్సి వస్తుంది. అయితే దీనికి తగిన ఫలితాన్ని పొందుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి చాలా రంగాల్లో ఈరోజు కలిసి వస్తుంది. స్నేహితుల నుంచి తన సహాయం పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణ ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాహనాలపై ప్రయాణం మానుకోవాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.