Today horoscope in telugu : గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు పంచమ యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని వివాదాలు ఉంటాయి. అయితే మాటల మాధుర్యంతో వీటిని పరిష్కరించుకుంటారు. ప్రతిభ, ధైర్యాన్ని చూపించడం ద్వారా ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే తల్లిదండ్రులు సహాయంతో వీటిని పరిష్కరించుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఎందుకంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా కలత చెందుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు ఎక్కువ సమయం పిల్లలతో గడుపుతారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అయితే కొత్త వ్యక్తులను వ్యాపారంలో చేర్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాతో కొత్త పెట్టుబడును పెడతారు. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొనడం ద్వారా కెరీర్ పై దృష్టి పెడతారు. సాయంత్రం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండడం వల్ల మానసికంగా ఆందోళనలతో ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులతో ఇప్పుడు లాభాలు పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతున్నా ..ఖర్చులు ఉండడం వల్ల కాస్త ఆందోళనగా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. వీరు చదువులో రాణిస్తారు. దీంతో గురువుల నుంచి ప్రశంసలు పొందుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్త వింటారు. వ్యాపారులకు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ప్రియమైన వారికోసం కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో ఒకరి వివాహం కోసం ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త పెట్టుబడులు పెడతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకున్నట్లయితే పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. అయితే మాటలతో వారిని ఆకట్టుకొని సమస్య పరిష్కరించుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : జీవిత భాగస్వామి సలహా ద్వారా వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. ఇవి అధిక లాభాలు వస్తాయి. ఇంట్లో ఏదైనా వివాదం జరిగితే మౌనంగా ఉండటమే మంచిది. కుటుంబ విషయాల్లో బయట వ్యక్తుల జోక్యాన్ని చేసుకోనివ్వదు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. సాయంత్రం ఉద్యోగులు నిరాశకు గురవుతారు. కొందరి చేష్టల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : విద్యార్థులు ఏ పోటీ పరీక్షల్లో పాల్గొన్నా విజయం సాధిస్తారు. వ్యాపారులు అనుకున్న లాభాలను సాధిస్తారు. గతంలో మొదలుపెట్టిన ఒక పని పూర్తి కావడంతో ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. దీంతో ప్రశంసలు దక్కుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. అయితే ఈ విషయంలో మౌనంగా ఉండటమే మంచిది. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా ఉంటారు. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల బెడద ఉంటుంది. అయితే తెలివితేటలతో ఆ సమస్య నుంచి బయటపడతారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉంటుంది. కొందరి మాటల వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలకు కొత్త ఒప్పందాలు చికాకు తెప్పిస్తాయి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈరోజు వ్యాపారులకు అనుకూలం. కొత్త వ్యాపారం ఏది ప్రారంభించిన అది విజయవంతంగా పూర్తవుతుంది. తల్లిదండ్రుల విషయంలో మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేయవచ్చు. విద్యార్థులకు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . కుటుంబంలో నెలకొన్న వివాదాలను తొలగించేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతాయి. ఉద్యోగులు అదనపు పాదాలను పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలను కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు దురుసు ప్రవర్తన చేస్తారు.