Today 18 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రుడి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయం విషయంలో మహార్దశ కలగనుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు రాయడానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. గతంలో ఎవరికైనా డబ్బు ఇస్తే ఇప్పుడు తిరిగి ఇస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. వ్యాపారులకు పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. ఇంటికి ఆకస్మాత్తుగా చుట్టాలు రావడంతో సందడిగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం. ఇలాంటి సమయంలో అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త ఆదాయ వనరుల కోసం సమీక్షిస్తారు.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా ఆదాయం వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి కటాక్షం ఉండే అవకాశం. ఉన్నట్లుండి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. పై చదువుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులారాశి వారికి ఈరోజు అన్ని పనులు పూర్తవుతాయి. కట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించాలని అనుకుంటే పెద్దల మద్దతు అవసరం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక రంగాల్లో విజయం వరించి అవకాశం ఉంది. కొందరు నిపుణులు ఇచ్చే సలహా వల్ల కొత్తగా పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఏదైనా పనిని మొదలు పెడితే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాజు ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇంట్లో చర్చ జరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనుల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. అధికారుల నుంచి వేధింపులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వారికి వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు కొత్త ఆదాయవరణంలో పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శత్రువుల భయాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాజు వారు ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి ధన లాభం ఉండనుంది. పెద్దల ప్రత్యేక అనుగ్రహం ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి
