https://oktelugu.com/

నేటి నుంచి తిరుపతి లడ్డూ విక్రయం

తిరుమల భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు తిరుమలలో లడ్డూల విక్రయం నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా కంట్రోల్ కు వస్తున్న నేపథ్యంలో తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి హైదరాబాద్లో లడ్డూలను విక్రయిస్తున్నట్లు టీటీడీ హైదరాబాద్ ప్రత్యేక అధికారి రమేశ్ తెలిపారు. లిబర్టీలోని టీటీడీ బాలాజీ భవన్ తోపాటు జూబ్లీహిల్స్ లోని టీటీడీ ప్రాంగణంలో కూడా శ్రీవారి లడ్డూను తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే నూతన సంవత్సర క్యాలెండర్, […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 12, 2020 7:18 am
    Follow us on

    తిరుమల భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు తిరుమలలో లడ్డూల విక్రయం నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా కంట్రోల్ కు వస్తున్న నేపథ్యంలో తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి హైదరాబాద్లో లడ్డూలను విక్రయిస్తున్నట్లు టీటీడీ హైదరాబాద్ ప్రత్యేక అధికారి రమేశ్ తెలిపారు. లిబర్టీలోని టీటీడీ బాలాజీ భవన్ తోపాటు జూబ్లీహిల్స్ లోని టీటీడీ ప్రాంగణంలో కూడా శ్రీవారి లడ్డూను తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను కూడా విక్రయిస్తున్నామన్నారు. తిరుమల అనగానే గుర్తుకు వచ్చేది లడ్డూ. శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు లడ్డూను తీసుకోని వారు ఉండరు. అక్కడికి వెళ్లలేని వారు ఆయా జిల్లాల్లోని టీటీడీ కేంద్రాల్లో లడ్డూను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.