ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలల్లో మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఎవరు ఉంటారో..? ఎవరు వెళుతారోనన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ఏపీ సీఎం జగన్ ఏ కొలమానంగా మంత్రి వర్గ విస్తరణ చేపడుతారోనన్న ఆందోళన కొందరిలో ఇప్పుడే మొదలైంది. ఇక ఇప్పటి వరకు మంత్రి పదవి చేపట్టని ఆశావహులు తమకు అవకాశం దక్కేలా పావులు కదుపుతున్నారు. అయితే జగన్ తీసుకునే నిర్ణయంలో కొలమానం కాకుండా ఫెర్ఫామెన్ష్ ను ముఖ్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: జగన్ పై కేంద్రానికి కేసీఆర్ ఫిర్యాదు: సానుకూలం తెలిపిన జలశక్తి మంత్రి..!
ఇప్పటివరకు ఉన్న మంత్రుల్లో కొందరు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతిపక్షాల దాడిని తిప్పి కొడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చే ఆరోపణలపై వెంటనే తనదైన శైలిలో సమాధానం ఇస్తున్న వారిలో అనిల్, కొడాలి నానిలు ఉన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుపై హాట్ టాఫిక్ నడుస్తోంది. దీనిపై ఎలాంటి ఆరోపణ వచ్చిన మంత్రి అనిల్ వెంటనే తిప్పి కొడుతున్నారు. అలాగే అసెంబ్లీలోనూ తన ప్రసంగంతో జగన్ మెచ్చుకునేలా చేశాడు. ఇక మరో మంత్రి కొడాలి నాని సైతం ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా వారిస్తున్నాడు. ముఖ్యంగా చంద్రబాబను టార్గెట్ చేసుకున్న ఆయన పరుష వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.
ఇక ఎమ్మెల్యేల విషయానికొస్తే ధర్మాన ప్రసాదరావు ప్రసంగం బాగానే ఉంటుందని కొందరు అంటున్నారు. అసెంబ్లీలో ఆయన సబ్జెక్టును ప్రధానంగా చేసుకొని మాట్లాడడంతో ప్రతిపక్షాలు సైతం ఆసక్తిగా వింటున్నాయట. మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబు సైతం తనదైన శైలిలో ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అలాగే కరణం ధర్మశ్రీ, రోజా వంటి వారు సైతం సమయానుకూలంగా ప్రభుత్వం తరుపున, పార్టీ తరుపున సమాధానాలు ఇస్తున్నారు.
Also Read: ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో గండం పొంచి ఉందా?
అయితే ఇప్పుడున్న మంత్రి వర్గంలో కొందరు మంత్రులు ఇప్పటికీ తడబాటును ప్రదర్శిస్తున్నారు. మంత్రి స్థానంలో ఉండి ఎదుటివారు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు కలగజేసుకోవడంతో ప్రభుత్వం విమర్శలపాలవుతుంది. సీదరి అప్పల్రాజు వంటి వారు గట్టిగానే మాట్లాడుతున్నా సబ్జెక్టుపై మాట్లాడలేకపోతున్నారని విమర్శలు వస్తున్నారు.
దీంతో తరువాత చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో నాలెడ్జ్ ఉన్న మంత్రులు కేబినెట్ లో ఉంటే ప్రజలకు కూడా సరైన న్యాయం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు తమ ప్రసంగాలు, ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలకు జగన్ కేబినేట్ లో అవకాశం ఇస్తారని చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్