
జనవరిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. సోమవారం ఢిలీఓ్ల ఐసీఎంఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో కరోనా టీకా తయారీ కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ పోర్టన్‌ను కూడా ప్రారంభించామన్నాఉ. ప్రస్తుతం దేశంలో మూడు రకాల కోవిడ్ వ్యాక్సి టీకాలకు మనుషులపై ట్రయల్స్ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇక కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలను జార చేసిందన్నారు. పరీక్షల కోసం ముందుకు వచ్చే ప్రతీ ఒక్కరికి టెస్ట్ చేయాల్సిందేనన్నారు.