
ప్రముఖ సింగర్ బెంగుళూరు నాగ రత్నమ్మ జీవిత కథ ఆధారంగా సింగీతం శ్రీనివాస్ తీయబోయే బయోపిక్‌లో సమంత నటించనున్నట్లు సమాచారం. నేటి జనరేషన్‌కు తగ్గట్లుగా సింగితం ఇప్పటకే కథను రూపొందించాడట. కరోనా నుంచి కోలుకున్న శ్రీనివాస్ ఇక సినిమాల్లో బిజీగా మారనున్నాడు. అటు సమంత సైతం ఇన్నిరోజులు షూటింగ్‌లు లేక ఖాళీగా ఉండడం తరువాత ఇలాంటి బయోపిక్‌లో నటించడం కొత్త ఉత్సాహాన్నిచ్చినట్లవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.