
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మమమ్మారి కల్లోలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా బోథ్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా బారిన పడ్డ ఆ కుటుంబం చికిత్స పొందుతూ వారం రోజుల వ్యవధిలో భార్య, భర్త, కుమారుడిని కరోనా బలి తీసుకుంది. దీంతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రులు అన్ని నిండిపోయి బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.