
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం మాటల్లో చెప్పడం కష్టం. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి ని నిరోధించడం చాలా దేశాలకు కత్తిమీద సాముగా మారుతోంది. ఇక ఈ మహమ్మారి ముగింపునకు వైద్య నిపుణులు సూచిస్తున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ప్రపంచ వ్యాప్తంగా టీకాల కొరత తీర్చే విషయమై అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ల పేటెంట్స్ రద్దుకు జో బైడెన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఒక వేళ ఇదే జరిగితే ఒక దేశం టీకాల ఫార్ములాను ఇతర దేశాలతో పంచుకునే వీలు ఏర్పడుతుంది. దాంతో ప్రపంచదేశాలు అన్ని రకాల టీకాలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.