
కరోనా మహమ్మారి మొదటి దశ అనంతరం ప్రభుత్వం, ప్రజలు, పాలనా యంత్రాంగంలో నిర్లక్ష్యం పెరిగిందని, ఫలితంగా ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు ఆర్ ఎస్ ఎస్ నిర్వహించిన పాజిటివిటీ అన్ లిమిటెడ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెకండ్ వేవ్ వస్తుందని అందరికీ తెలుసునని వైద్యులు సైతం హెచ్చరించినా నిర్లక్ష్యంగానే ఉన్నామన్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ కూడా దేశంలో వస్తుందని చెబుతున్నారని, దానికి భయపడుతామా సరైన ధ్రుక్పథంతో వైరస్ పై పోరాడి గెలుద్దామా అని ప్రశ్నించారు.