
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రం చేసేందుకు పంజాబ్ రైతులు మరోసారి సిద్ధమయ్యారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన రైతులు బుధవారం అమృత్‌సర్‌లోని బియాస్ పట్టణంలో సమావేశమయ్యారు. లాక్ డౌన్, కరోనా నిబంధనలు ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఒక చోట చేరారు. ఇందులో మహిళలు, పెద్ద వారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేేకంగా రైతులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలను తీవ్రం చేసేందుకు ఢిల్లీ సరిహద్దుకు వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం పలు వాహనాల్లో సింఘుకు బయలు దేరారు.