
తెలంగాణలో ప్రభుత్వ శాఖల్లో 67 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మే లో శాఖల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పట్లో మంత్రిమండలికి నివేదించారు. ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి. అన్నింటినీ క్రోడికరించగా 67,820 ఖాళీలు తేలాయి. పూర్తి జాబితాను ఈ నెలలో జరిగే మత్రి మండలి సమావేశంలో సమర్పించనుంది.