
ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్ లో సోమవారం చోటుచేసుకుంది. హత్నూర ఎస్ ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వనమాల సాయిచరణ్ (24) ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించిన ఆనంతరం గొడవపడ్డారు. అనంతరం ఇంటికెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.