
కోవిడ్ 19 పై జాతీయవిధానం రూపొందించేందుకు సుమోటోగా తీసుకున్న కేసుపై కొందరు లాయర్లు విమర్శలకు దిగడం పై సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థ ఇలా నాశనమవుతోందంటూ వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం బార్ అసోసియేషన్ల ని కొందరు సీనియర్ సభ్యుల తీరు పై విచారం వ్యక్తం చేసింది.