
పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో 2-3 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం తెలిపింది. కారణం ఏమైనా ఈ అంశంపై కేంద్రం ప్రకటన చేయడానికి ఇష్టపడటం లేదని.. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలో ఆలోచించి జారీ చేస్తామని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు.