
జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ ను సుప్రీం కోర్టు రూపొందించింది. యాప్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ గురువారం అధికారికంగా ప్రారంభించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన అన్నారు. జస్టిస్ కన్విల్ కర్, చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ లతో కూడిన కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సుప్రీం కోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే పొందవచ్చని అన్నారు.