
కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో భారత్ ను చూస్తే తెలుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రియేసన్ అన్నారు. భారత్ లో కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చాలా క్లిష్టపరిస్థితులున్నాయన్నారు. ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి భారత్ కు ఉందన్నారు. వ్యాక్సినేషన్ పై భారత ప్రభుత్వం చర్యలు బాగున్నాయన్నారు.