
ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది కొవిడ్ రోగులు చనిపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం సాధ్యమైనంత సాయం అందించాలని ఆయన కోరారు. ఆక్సిజన్ కొరత కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న 20 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోొయినట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.