
ఏపీ సీఎం జగన్ ను నీతి ఆయోగ్ బృందం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ 2020-21 రిపోర్టును సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం వైఎస్ జగన్ నీతిఆయోగ్ సభ్యులకు వివరించారు. ఎంపీఐ ర్యాంకింగ్ లో భారత్ 62 స్థానంలో ఉందని నీతి ఆయోగ్ సలహాదారు వెల్లడించారు. మానవాభివృద్ధి సూచికలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.