Nimmala Rama Naidu: పోలవరం ప్రాజెక్టెకను పట్టాలెక్కించె పనులు చేస్తుంటే వైసీపీ కరపత్రికలో అబద్దాలు ప్రచురిస్తున్నారంటూ ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. నాడు నిర్లక్ష్యంతో పోలవరం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాలతో మాట్లాడుతూ.. పోలవరం జరుగుతున్న పనుల్లో పురోగతిని వివరించారు. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు 4 సార్లు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారని తెలిపారు.