
మాజీ సీఎం వైఎస్ఆర్ పై తెలంగాణ మంత్రులు వాడుతున్న భాష సరికాదని మంత్రి కన్నబాబు అన్నారు. రాజకీయాల కోసమే తెలంగాణ మంత్రులు నీటి వివాదం చేస్తున్నారన్నారు. బూతులు తిట్టి హీరోయిజం అనుకుంటున్నారా అని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి మాటలే మాట్లాడేవారన్నారు. వారి మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. జగన్ ని తిడితే రాజకీయ లాభం వస్తుందనుకుంటున్నారని కన్నబాబు అన్నారు.