
టీమిండియా, ఇంగ్లాండ్ జట్లలకు ఐసీసీ షాక్ ఇచ్చింది. నాటింగ్ హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ కు సంబంధించి ఇరు జట్ల నుంచి రెండు పాయింట్ల కోత విధించింది. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.