
గుజరాత్ లో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మరణించారు. గుజరాత్ లో ని ఆనంద్ జిల్లాలోని తారాపూర్ జాతీయ రహదారిపై కారును భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు సూరత్ నుంచి భావ్ నగర్ కు వెళుతుండగా ఇంద్రనాజ్ గ్రామ సమీపంలో కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఏడుగురు పురుషులు, ఓ బాలుడు మరణించారు. మృతదేహాలను తారాపూర్ రెఫరల్ ఆసుపత్రికి తరలించారు.