
మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్వీటర్ కు చివరిసారి, కఠినమైన హెచ్చరికను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐటీకి చెందిన సీనియర్ అధికారులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాటజీ శాఖా మంత్రి రవిశంకర్ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేం నిర్వహించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.