
ఐసీసీ ప్రపంచ చాంపియన్ షిప్ లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ ఐదో రోజు ఆటకూ వరుణుడు అడ్డుతగిలాడు. నిన్న నాలుగో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా నేడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షం పడుతూ తగ్గుతూ ఉండడంతో పిచ్ పై కవర్లను కప్పి ఉంచారు. ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్నాయి. త్వరలోనే అవి కూడా తగ్గే అవకాశం ఉండడంతో మ్యాచ్ ప్రారంభం అవుతుందనే భావిస్తున్నారు.