కుప్పకూలిన ప్రఖ్యాత డార్విన్ ఆర్చ్

వైల్డ్ లైఫ్ పరంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గాలాపాగోస్ ద్వీపంలో ప్రకృతి సిద్ద ప్రమాదం చోటు చేసుకుంది. పేరుగాంచిన సహజసిద్ధ రాతి నిర్మాణం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది. ఈ విషయాన్ని ఈ క్విడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఈ చారిత్రక రాతి నిర్మాణంలో ఇప్పుడు రెండు స్తంభాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ మంత్రిత్వశాఖ విడుదల చేసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. ద్వీపసముహంలోని ఉత్తర భాగంలో డార్విన్ ఆర్చ్ భాగం సహజ కోత కారణంగా కూలిపోయింది. దీనికి […]

Written By: Suresh, Updated On : May 19, 2021 10:50 am
Follow us on

వైల్డ్ లైఫ్ పరంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గాలాపాగోస్ ద్వీపంలో ప్రకృతి సిద్ద ప్రమాదం చోటు చేసుకుంది. పేరుగాంచిన సహజసిద్ధ రాతి నిర్మాణం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది. ఈ విషయాన్ని ఈ క్విడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఈ చారిత్రక రాతి నిర్మాణంలో ఇప్పుడు రెండు స్తంభాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ మంత్రిత్వశాఖ విడుదల చేసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. ద్వీపసముహంలోని ఉత్తర భాగంలో డార్విన్ ఆర్చ్ భాగం సహజ కోత కారణంగా కూలిపోయింది. దీనికి ప్రముఖ జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ పేరు పెట్టారు.