
ఒలింపిక్స్ లో ఓ కోచ్ ఫెన్సింగ్ ప్లేయర్ కు టీవీ కెమెరాల ముందే ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ అనే ప్లేయర్ లైవ్ లో తన కోచ్ చేసిన పని చేసి ఆశ్చర్యపోయింది. అయితే అతని ప్రేమను అంగీకరించి పెళ్లికి అంగీకరించడం విశేషం. అంతకుముందే తొలి రౌండ్ మ్యాచ్ లోనే ఓడిన బాధలో ఆమె ఇంటర్వ్యూ ఇస్తోంది. ఇంతలో ఆమె వెనుక నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని కోచ్ లూకాస్ సాసెడో నిల్చున్నాడు. కోచ్ సడెన్ గా అలా చేయడం చూసి పెరెజ్ ఆశ్చర్యపోయింది. చాలా మంది మనల్ని చూస్తున్నారు.. ఎస్ అని చెప్పు అని కోచ్ మోకాలిపై కూర్చొని వేడుకున్నాడు. దీంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసింది.
Y después del combate de esgrima le pidieron casamiento a María Belén Pérez Maurice en vivo. pic.twitter.com/wEmGuOW7CB
— Rústico ⭐⭐⭐ (@lautarojl) July 26, 2021