కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. హాస్పిటళ్లలో ఆక్సిజన్, ఐసీయూ పడకల కొరతపై కేంద్రాన్ని నిలదీశారు. కరోనాతోనే మరణాలు నమోదవుతున్నాయంటే ఆక్సీజన్ కొరతతో మరింత మంది ప్రాణాలు వదులుతున్నారని ఆరోపించారు. వాటికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరో్నా వైరస్ రోగిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుందని ఆక్సిజన్ సరఫరా ఐసిీయూ పడకల ఏర్పాటులో కేంద్రం విఫలమైందని ట్వీట్ చేశారు.