ఏడాది పెట్రో పన్నులు రూ.6 లక్షల 70 వేల కోట్లు..

ఈరోజుల్లో ఓ సామాన్యుడి ఆదాయంలో సగం వరకు పెట్రోల్ ఖర్చులకే వెళ్తుందంటే ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ప్రతీ అవసరానికి బండి లేకుండా పని సాగని రోజులివి. నిత్యం ఏదో ఒక పని మీద బైక్ పై వెళ్లాల్సిన అవసరం ఉండడంతో పెట్రోల్ పై నే ఖర్చు చేస్తున్నారు. ఇలా సామాన్యలు, మధ్య తరగతికి చెందిన వారు ఖర్చు చేసిన మొత్తంతో ప్రభుత్వాలు మాత్రం లాభపడుతున్నాయి. మిగతా వాటి కంటే పెట్రో పన్నుల మీద వచ్చిన ఆదాయమే ఎక్కుగా […]

Written By: NARESH, Updated On : July 29, 2021 3:55 pm
Follow us on

ఈరోజుల్లో ఓ సామాన్యుడి ఆదాయంలో సగం వరకు పెట్రోల్ ఖర్చులకే వెళ్తుందంటే ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ప్రతీ అవసరానికి బండి లేకుండా పని సాగని రోజులివి. నిత్యం ఏదో ఒక పని మీద బైక్ పై వెళ్లాల్సిన అవసరం ఉండడంతో పెట్రోల్ పై నే ఖర్చు చేస్తున్నారు. ఇలా సామాన్యలు, మధ్య తరగతికి చెందిన వారు ఖర్చు చేసిన మొత్తంతో ప్రభుత్వాలు మాత్రం లాభపడుతున్నాయి. మిగతా వాటి కంటే పెట్రో పన్నుల మీద వచ్చిన ఆదాయమే ఎక్కుగా ఉంది. గత ఏడాది కాలంలో ప్రభుత్వానికి పెట్రో పన్నుల మీద వచ్చిన ఆదాయం రూ.6,71,461. ఈ విషయాన్ని కేంద్రం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.

వాస్తవానికి పెట్రోల్ తయారైన రేటు రూ.30. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ రేట్లు తగ్గితే ఇక్కడ రేట్లు తగ్గించడ లేదు. పెరిగితే మాత్రం పెంచుతున్నారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి కావాల్సినంత వారు దోచుకుంటున్నారు. దీంతో సామాన్యుడి జీతమంతా పెట్రోల్ పోసుకోవడానికే ఖర్చవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇక దేశ జనాభా 130 కోట్లు. అందరూ పెట్రోల్ పన్నులు కట్టారనుకుంటే.. ప్రతి మనిషి రూ.5వేలు పన్నుల కట్టినట్లు అర్థమవుతోంది. అయితే పెట్రోల్ రేటు పెంచినంత మాత్రాన పెట్రోఉత్పత్తులపైనే కాకుండా దానిపై ఆధారపడిన ఇతర వస్తువుల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ రేటు రూ.110 దగ్గర్లో ఉంది. డీజిల్ 100కు చేరువవుతోంది. డీజిల్ ఎక్కువగా వినియోగించే లారీలు, ట్రక్కులు ఎక్కువగా నిత్యావసరాలు తీసుకెళ్తుంటాయి. దీంతో వాటి ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇవన్నీ పట్టించుకోని ప్రభుత్వాలు ఏటికేయేడు పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తివేత దగ్గర్నుంచి ఏడాది కాలంలో రూ.30 వరకు పెంచారు. ప్రస్తుతం ప్రజలు రూ.70 వరకు పెట్రో పన్ను కడుతున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం పట్టని ప్రభుత్వాలు రేట్లు కొంచెమైనా దించేందుకు చొరవ చూపడం లేదు. అవసరం లేని పథకాలన్నీ ప్రవేశపెట్టి ప్రజలకు దగ్గరవుతున్నా.. పెట్రో ధరల విషయంలో మాత్రం ఏ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని అంటున్నారు.