Thaman OG Tour : టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గత కొంతకాలం నుండి ‘ఓజీ టూర్’ అనే లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్స్ ని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వీటికి మ్యూజిక్ లవర్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నేడు ఆయన ఈ ‘ఓజీ టూర్’ ని హైదరాబాద్ లో నిర్వహించాలని అనుకున్నాడు. అందుకోసం కొన్ని రోజుల క్రితం ఆయన ఒక భారీ ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేశారు. తమన్ ఫ్యాన్స్ లో కూడా ఈ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ పై ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఎంత టిక్కెట్ రేట్ ఉన్నా సరే , కొని వెళ్లాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్ ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి కూడా అన్ని రకాల అనుమతులు వచ్చాయి. కానీ చివరి నిమిషం లో హైదరాబాద్ లో ఏర్పడిన వాతావరణం కారణం గా రద్దు చేయాల్సి వచ్చింది.
ఈ విషయాన్నీ తమన్ తన ట్విట్టర్ వేదిక ద్వారా చాలా ఎమోషనల్ గా ఒక ట్వీట్ వేశాడు , ఆయన మాట్లాడుతూ ‘నాకు , నా 56 మంది టీం సబ్యులకు ఇది గుండెలు ఆగిపోయే వార్త. ఓజీ టూర్ తో గత 45 రోజులుగా విశ్రాంతి లేకుండా పని చేస్తూ , అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ వచ్చాం. మేమంతా ఒక టీం గా పని చేస్తూ , మంచి జోష్ తో ఈ కాన్సర్ట్ ని నివహించడానికి రెడీ అయ్యాం. కానీ మనం ఒకటి తలిస్తే , దైవం మరొకటి తలుస్తాది అంటారు కదా, నేనెప్పుడూ దేవుడి పట్ల చాలా విశ్వాసంతో ఉంటాను. అదే విధంగా విధిని చాలా గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా మీ ప్రేమ, నమ్మకం. ఈసారి మరింత జోష్ తో ఈ ఓజీ కాన్సర్ట్ ఉంటుంది. నా కం బ్యాక్ ఈసారి మామూలు రేంజ్ లో ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు తమన్. ఆయన మాట్లాడిన ఈ మాటల్లో బాధని చూస్తుంటే , ఈ కాన్సర్ట్ పై ఆయన ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుస్తోంది.
It’s Heartbreaking for Me & My 56 Member Team
To Work on this #OgtourIndia .. from last 45 days Tirelessly Taking all the Feedback backs In A positive Manner
We as a Team Took all the Good Energy in this World to Make this Concert happen In a Positive Manner .
Sometimes It has…— thaman S (@MusicThaman) June 13, 2026

