https://oktelugu.com/

పంజాబ్ లో భారీ ఉగ్రకుట్ర భగ్నం

పంజాబ్ లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అమృత్ సర్ లోని దాలిక్ గ్రామంలో టిఫిన్ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధినం చేసుకున్నామని డీజీపీ దినకర్ గుప్తా సోమవారం తెలిపారు. పేలుడు పదార్థాలు పాక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్ ద్వారా తరలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే శని, ఆదివారాల్లో ఆ ప్రాంతంలో డ్రోన్ లు సంచరించాయని తెలిపారు. ఈ సమయంలో ఓ బ్యాగ్ ను వదిలివెళ్లినట్లు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 9, 2021 / 02:14 PM IST
    Follow us on

    పంజాబ్ లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అమృత్ సర్ లోని దాలిక్ గ్రామంలో టిఫిన్ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధినం చేసుకున్నామని డీజీపీ దినకర్ గుప్తా సోమవారం తెలిపారు. పేలుడు పదార్థాలు పాక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్ ద్వారా తరలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే శని, ఆదివారాల్లో ఆ ప్రాంతంలో డ్రోన్ లు సంచరించాయని తెలిపారు. ఈ సమయంలో ఓ బ్యాగ్ ను వదిలివెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని తెలిపారు. దాన్నితెరిచి చూడగా టీఫిన్ బాక్స్, ఐదు హ్యాండ్ గ్రనేడ్, డిటోనేటర్లు ఉన్నాయని తెలిపారు.