Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం

వరంగల్ జిల్లా శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు  నుజ్జు అయింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version