దాంతో ఈ క్యాస్టింగ్ కౌచ్ గత రెండేళ్లుగా భారతీయ సినిమా పరిశ్రమలో హల్ చల్ చేస్తూనే ఉంది. వేధింపులకు గురైన తారలు ‘మీటూ’ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తూనే ఉన్నారు. తాజాగా మలయాళ నటి ‘రేవతి సంపత్’ బయటికొచ్చి తన సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. పైగా తనని వేధించిన 14 మంది పేర్లను వాళ్ళ ఫొటోలతో సహా ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేయడం విశేషం.
అయితే రేవతి పోస్ట్ చేసిన పేర్లల్లో పాపులర్ ఆర్టిస్ట్ సిద్ధిక్, దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, ఓ డాక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్ కూడా ఉండటం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఇక రేవతి సంపత్ తనను వేధించిన వారి గురించి చెప్పుకొస్తూ.. ‘అవును, ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాలి. తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సినిమాల్లో పనిచేసే అమ్మాయిలకు ఇలాంటి కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను తగ్గను, భయపడను’ అంటూ రేవతి తెలిపారు.
ఇంతకీ రేవతి సంపత్ పోస్ట్ చేసిన ఆ 14 మంది లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే..
1. రాజేశ్ టచ్‌రివర్ (దర్శకుడు)
2. సిద్ధిక్ (నటుడు)
3. ఆషికి మహి(ఫొటోగ్రాఫర్)
4. సిజ్జు (నటుడు)
5. అభిల్ దేవ్ (కేరళ ఫ్యాషన్ లీగ్ ఫౌండర్)
6. అజయ్ ప్రభాకర్ (డాక్టర్)
7. ఎంఎస్ పదూష్ (అబ్యూసర్)
8. సౌరబ్ కృష్ణన్ (సైబర్ బల్లీ)
9. నందు అశోకన్ (డివైఎఫ్‌ఐ కమిటీ మెంబర్)
10. మాక్స్‌వెల్ జోస్ (షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్)
11. షానుబ్ కరావత్ (యాడ్ డైరెక్టర్ )
12. రాగేంద్ పై (క్యాస్టింగ్ డైరెక్టర్)
13. సరున్ లియో (ఈఎస్‌ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్)
14. బిను (సబ్ ఇన్స్‌పెక్టర్ పొన్‌తూరా స్టేషన్, తిరువనంతపురం)
ఐతే ఈ నటీమణితో ఈ 14 మంది జరిపిన కామ క్రీడలలో నిజమెంత అని ప్రస్తుతం విచారణ జరుగుతుంది. వీరిలో కొంతమంది రేవతిని వేధించలేదని, కాకపోతే ఆమెకు అవకాశం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మొహం చాటేసిన వారి పై కూడా రేవతి ఆరోపణలు చేసిందని తెలుస్తోంది.