
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వం టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా రేపు వెల్లడికానున్న ఫలితాలు ఎఫ్ ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న పచ్చజెండా ఊపారు. అధికారులు పంపిన దస్త్రంపై మంత్రి సంతకం చేసిన విషయం తెలిసిందే.