
కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో టీకాల వృథాను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. గురువారం ఆయన పది రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను, ప్రణాళికలను అధికారులు మోదీకి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలపై ప్రధాని ఆరా తీశారు. భేటీలో ఛత్తీస్ గఢ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, బెంగాల్ అధికారులు పాల్గొన్నారు.